నేటి సాక్షి – కోరుట్ల (రాధారపు నర్సయ్య)—–+జగిత్యాల జిల్లాలో రంజాన్ పర్వదినం సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, శాంతి, సౌభ్రాతృత్వాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ, పరస్పర గౌరవం మరియు మానవతా విలువలను మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు. సమాజంలో ఐక్యతను పెంపొందించే ఈద్ పండుగను అందరూ ఆనందంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.*ఈద్గాల వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన*పండుగ నేపథ్యంలో జిల్లాలోని పలు ఈద్గాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా బందోబస్తును ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా పరిశీలించారు. ప్రార్థనలకు భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ముఖ్యంగా కోరుట్లలోని ఈద్గా వద్ద సందర్శన నిర్వహించి, అక్కడి భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తూ సిబ్బందికి అవసరమైన సూచనలు జారీ చేశారు.*పోలీసులకు అప్రమత్తతపై ఆదేశాలు*ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. పండుగ రోజులలో జిల్లావ్యాప్తంగా నిరంతర పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు, సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి డీఎస్పీ ఏ. రాములు, కోరుట్ల సిఐ సురేష్ బాబు,ఎస్‌ఐ చిరంజీవి ఇతర సిబ్బంది పాల్గొన్నారు. పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.______





