Friday, April 10, 2026

*మృతి చెందిన వేంపెంట గ్రామ గూడెం సుదర్శనం కుటుంబానికి సింగపూర్ నాగేశ్వరరావు తరఫున 5వేలు ఆర్థిక సహాయం అందించిన మాజీ సర్పంచ్ టేకూరి. రామసుబ్బమ్మ*

నేటి సాక్షి 10 ఏప్రిల్ పాములపాడు:- పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో గూడెం సుదర్శనం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకుని మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ పూలదండ వేసి, నివాళులు అర్పించారు. గూడెం సుదర్శనం కుటుంబానికి సింగపూర్ నుండి అంతర్జాతీయ సమాజ సేవకుడు & వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు సంతాపాన్ని, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం ఆయన కుటుంబానికి సింగపూర్ నాగేశ్వరరావు తరఫున 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. సుదర్శనం మృతి పార్టీకి తీరని లోటని ధైర్యంగా ఉండాలని మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటామని ఆ కుటుంబానికి టేకూరి. రామసుబ్బమ్మ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ బోనపల్లె సత్యరాజు, నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ (డీసీ)ఆల్ఫ్రైడ్, బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, ముద్దపాటి ప్రసాద్, నెత్తికొప్పుల రత్నాకర్, బోనాల భాస్కర్, సుబ్బరావు, దార జీవన్న, ఆంథోనీ, కొప్పుల సుధాకర్, కిరణ్, రాజకుమార్, ఏడిండ్ల ప్రవీణ్, మాడుగుల ఏసన్న,తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News