- ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
- పాల్గొన్న కార్పొరేటర్లు
నేటి సాక్షి – మేడ్చల్ ప్రతినిధి : ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జిహెచ్ఎంసి ఈస్ట్ జోన్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ని తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి ఉప్పల్ నియోజకవర్గానికి నిధులు కేటాయించమని కోరడం జరిగింది. ఉప్పల్ నియోజకవర్గం లోనీ చిల్కానగర్ డివిజన్ లో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని స్ట్రాం వాటర్ డ్రైన్ పనుల కొరకు నిధులు కేటాయించమన స్ట్రాం వాటర్ డ్రైన్, సివరేజ్ పైప్ లైన్లు పూర్తయిన ప్రాంతాలలో సిసి రోడ్లు శాంక్షన్ చేయాల్సిందిగా, అదేవిధంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలలో ఓపెన్ జిమ్ సాంక్షన్ చేయాల్సిందిగా, అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురి కాకుండా, ప్రహరీ గోడలకు నిధులు కేటాయించాల్సిందిగా కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించిన జోనల్ కమిషనర్ వీలైనంత త్వరలో పైన ప్రతిపాదించిన పనులన్నింటికీ నిధులు కేటాయించి పనులు పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ మెంబర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్, మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, హౌసింగ్ బోర్డ్ కార్పొరేటర్ జరిపోతూల ప్రభుదాస్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ పాల్గొన్నారు.





