నేటి సాక్షి, బెజ్జంకి:
బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామంలో ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులు, గ్రామస్థులు, బాలవికాస ప్రతినిధులు కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం మానవ హారం ఏర్పాటు చేసి, నీటిని పొదుపు చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు సహకరించాలనే ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, బాలవికాస ప్రతినిధులు గాజే సుజాత, సుజాత వట్టి, భైర సంతోష్, న్యాల రాజేశం, వడ్ల కొండ శ్రీను, మహిళా సంఘ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.





