Friday, April 3, 2026

తొమ్మిది సంవత్సరాలు జిల్లా బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఏకైక వ్యక్తి బొక్క నరసింహారెడ్డి – శ్రీరాములు అందెల

  • పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే వ్యక్తి బొక్క నర్సింహారెడ్డి – శ్రీరాములు అందెల

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్) : భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షులుగా 9 సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించినటువంటి బొక్క నరసింహా రెడ్డి ని ఈరోజు వారి నివాసంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో సాధారణ కార్యకర్త నుండి జిల్లా అధ్యక్షుడిగా పార్టీకి ఎనలేని సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి బొక్క నరసింహారెడ్డి కొనియాడారు. అహర్నిశలు పార్టీ అభ్యున్నతి కోసం పనిచేస్తూ జిల్లాలో రాష్ట్ర పార్టీ అప్పగించిన ప్రతి కార్యక్రమాలను విజయవంతం చేసి రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా బిజెపి శాఖకు మంచి పేరు తీసుకొచ్చినటువంటి బొక్క నరసింహారెడ్డి సేవలు మరువలేనివని రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులను అందుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తర్రే మల్లేష్ యాదవ్, బడంగ్ పేట్ కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణా రెడ్డి, బిజెపి జిల్లా సీనియర్ నాయకులు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి, ఢిల్లీ వెంకటేష్ ముదిరాజ్ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News