- మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్..

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ ) : మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1429 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ రాజన్న భీమేశ్వర ఆలయం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమంతో పాటు వాటర్ బాటిల్స్ పంపిణీ చేసినట్లు ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలిపారు. శనివారం అన్నదాతలుగా గోవిందారం గ్రామానికి చెందిన రాగేటి మహేష్ స్రవంతి దంపతులు పేదలకు అన్నదానం చేయాలన్న సంకల్పంతో అమూల్య కిషన్ రావు జ్యోత్స్న, వీరి కుమారుడు రోహిత్ రావు కూతురు రోషిని రావు,బీ జువ్వాడి స్నేహాలత వెంకటేశ్వరరావు దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు, గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాల చందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత, కొడుకులు కోడళ్లు ప్రజ్ఞ శరత్ చంద్ర దంపతులు, శిరీష సాయిచంద్ర దంపతులు, శర్వాణి రవిచంద్ర దంపతులు, హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయికృష్ణ ఉన్నారని తెలిపారు. పేదలకు అన్నదాన కార్యక్రమానికి సహకారం అందించాలనుకునే దాతలు ట్రస్టు సభ్యులను సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, వొడ్యాల వేణు, పొలాస రాజేందర్, పసుల శ్రీనివాస్, సగ్గు రాహుల్ తదితరులు పాల్గొన్నారు.





