Friday, April 3, 2026

ప్రతి ఒక్కరూ ఎలక్షన్ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలి

నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : పెద్దపల్లి నోడల్ జిల్లా కి సంభందించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ – 2025 మెగా ఈవెంట్ రెండో రోజు కూడా విజయవంతంగా పూర్తైంది. రెండో రోజు కార్యక్రమానికి మంచిర్యాల RDO సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గూడూరి శ్రీనివాస రావు. ముఖ్య అతిథిగా పాల్గొని యువతను ఉద్దేశించి స్పూర్టివంతంగా ప్రసంగించారు. మాట్లాడుతూ… భారతదేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో మార్పు తెగలిగే శక్తి యువతలో దాగి ఉందని అన్నారు. కాబట్టి ప్రపంచంలో అత్యధిక యువతను కలిగి ఉన్న భారత దేశంలో ఈ దేశ భవిష్యత్ ను నిర్ధారించే శక్తి యుక్తులను వెలికి తీయడంలో భాగంగా యువతలో నాయకత్వాన్ని పెంపొందించుకుని క్రమంలో భాగంగా యువ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించడం. యువతకు కోసం కేంద్ర యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ డిజైన్ చేసిన అత్యుత్తమ కార్యక్రమం అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదువుకున్న యువతకు దేశ కాల మాన పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకుంటారనేది నా అభిప్రాయం అన్నారు.
ప్రతి ఒక్కరూ ఎలక్షన్ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలన్నారు. ఒక మంచి నాయకుడు మీ యువతలో నుండే ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వాన్ని నడిపించే ప్రతిభగల నాయకుడు వ్యవస్థ కి ఇరుసు లాంటి కాబట్టి యువత ఈ దేశానికి ఇరుసులా పని చెయ్యాలి
గోదావరిఖని ప్రాంతంతో తనకున్న అనుబంధాన్ని నెమరు ఇసుకున్నారు.
విద్యార్థులందరూ ఒక నిర్ధారిత దీర్ఘ కాలిక లక్ష్యం పెట్టుకొని లక్ష్యాన్ని చేరుకోవడం కోసం 18 గంటలపాటు సాధన చెయ్యాలని సూచించారు. కష్ట పడకుండా లక్ష సాధనలో గురువుల మార్గ దర్శనం ఎంతో అదనపు ప్రయోజనం చేస్తుందన్నారు. ఈ క్రమంలో భాగంగా తన మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో చదువుకునే రోజుల్లో తన కెమిస్ట్రీ లెక్చరర్ శ్రీ నరసింగ రావు. చేసిన దోహదం గురించి ప్రస్తావించారు. ఇచ్చిన స్ఫూర్తి తోనే నేను మీ ముందు నిలబడ్డానని చెప్పారు. కాబట్టి భారతదేశానికి నేటి యువత చుక్కాని లాంటిదని ఆశాభావం వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా జై కిషన్ ఓజా. మాట్లాడుతూ… పెద్దపల్లి జిల్లా మంచిర్యాల జిల్లా యువకులు ఉత్సాహంగా యువ పార్లమెంట్ కార్యక్రమమంలో పల్గొంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ పేవింగ్ థీ వే ఫర్ వికసిత్ భారత్ గురించి మీ అభిప్రాయాలను వ్యక్తం పరచాలని కోరారు. పోటీలో ఉండడం ముఖ్యమని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. యువ పార్లమెంట్ నోడల్ అధికారి ఏ.సాంబశివ రావు మాట్లాడుతూ… విద్యార్థులకు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ యొక్క ఉద్దేశ్యాన్ని ఆశయాన్ని వివరించారు. నిబంధనలు, ప్రమణాల గురించి వివరంగా చెప్పారు. పెద్దపల్లి ఐడి కాలేజీ నుండి ప్రిన్సిపల్ డా. లక్ష్మీ నరసయ్య, సీనియర్ అధ్యాపకులు డా అనంతుల సతీష్ కుమార్. ప్రత్యేక పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్టాఫ్ సెక్రటరీ డా సుబ్బారావు. ఎన్. ఎస్. ఎస్. కోఆర్డినేటర్లు డా ఏం. నరేష్, డా. డి కిరణ్మయి, ఎన్. సీ.సీ ఆఫీసర్ లెఫ్టినెంట్ బి తిరుపతి, డా శారద, డా శంకరయ్య, డా అజయ్ కుమార్, శ్రీదేవి, డా స్రవంతి, సమత, డా రామకృష్ణ, డా సురేష్, డా రవీందర్, కిరణ్ కుమార్ తో పాటు ఇతర అధ్యాపకులు, విద్యార్థులు, వాలంటీర్లు, ఎన్. సీ. సీ కాడేట్స్, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News