Friday, April 3, 2026

ఉపాధి కూలీల, గ్రామీణ పేదల సమస్యలపై పోరాటం

  • జిల్లా కార్యదర్శి రాళ్ల బండి శశిధర్

నేటిసాక్షి చేర్యాల : ఉపాధి హామీ కూలీల, గ్రామీణ పేదల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాళ్ల బండి శశిధర్ పిలుపునిచ్చారు. శనివారం రోజున చేర్యాల స్థానిక కార్యాలయంలో గుండ్ర రవీందర్ అధ్యక్షతన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం చేర్యాల మండల, పట్టణ కమిటీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా రాళ్ల బండి శశిధర్ మాట్లాడుతూ నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని దీనితో కూలీలు, గ్రామీణ పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు రెండు నెలలైనా కూలీ డబ్బులు రావడంలేదని, పొద్దంతా పనిచేసిన ఫలితం లేకుండా అధికారులు వ్య వరిస్తున్నారని ఎండాకాలంలో సమ్మర్ అలవెన్స్ ను, పలుగు, పారా, తట్ట లాంటి పనిముట్లకు వాడకం చార్జీని ఇవ్వడం లేదని క్రమక్రమంగా ఒక్కొక్క దానిని తగ్గించి కూలీలకు ఫలితం లేకుండా చేస్తున్నారని ఈ చర్యలను మానుకొని పెరుగుతున్న ధరల కనుగుణంగా రోజు కూలి 800 రూపాయలు, కుటుంబానికి 200 రోజుల పని దినాలను కల్పించాలని, పే స్లిప్పులు ఇవ్వాలని, ఫోటో క్యాప్చరింగ్ విధానం తీసివేయాలని, అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని, రేషన్ కార్డులు, భూమిలేని నిరుపేద ఉపాధి జాబు కార్డు గల కుటుంబాలకు ఆత్మీయ భరోసా కుటుంబానికి 12,000 రూపాయలు, పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా పేదలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు ఎన్నో ఏళ్ల నుండి పేదలకు అనేక హామీలు ఇచ్చి కాలయాపన చేస్తూ మోసపుచ్చుతున్నారని ఈ హామీలు హామీలుగానే మిగిలిపోతున్నాయని హామీలు నెరవేరాలంటే ప్రజలకు అందాలంటే అర్హులైన నిరుపేదలందరూ ఏకమై పోరాటాలకు సిద్ధం కావాలని అప్పుడే హామీల అమలుకు పరిష్కారం దొరుకుతుందని ఏండ్ల నుండి నిరీక్షణ చెందుతున్న పేద ప్రజలు తెలంగాణ వ్యవసాయ కార్మిక పోరాటాల్లో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొంగరి వెంకట మావో మండల కార్యదర్శి గొర్రె శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి బోయిని మల్లేశం, మల్కనీ ఎల్లయ్య, మరియాల సత్తయ్య, జీడాల చంద్రయ్య,గర్నపల్లి చంద్రం, పో న మైన సిద్ధులు, గొలుసుల సురేష్,తాడూరి నర్సింలు, భీమ శ్రీను, పండుగ బాలమని, దోనికల కనకవ్వ, నూర్ బి, కర్రోళ్ల కనుక లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News