Saturday, April 4, 2026

ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ముఠా అరెస్టు

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు)
అమాయక వ్యవసాయదారులను లక్ష్యంగా చేసుకోని ప్రముఖ కంపెనీల పేర్లతో పాటు గడువు తీరిన పురుగు మందులు విక్రయిస్తున్న ముఠాలోని ఏడుగురిని ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్‌ మరియు మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా *అరెస్టు అరెస్టు చేయగా ఒక పరారీలో వుండగా, మరోకరు ప్రస్తుతం జైలులో వున్నారు. నిందితుల నుండి పోలీసులు వీరి నుండి సుమారు 78 లక్షల 63 వేల రూపాయల విలువ గల గడువు తీరున మరియు నకిలీ పురుగు మందులు, నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందుల తయారీ మిషనరీ, ప్రింటింగ్‌ సామగ్రి, రెండు కార్లు,ఆరు సెల్‌ఫోన్ల ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల వివరాలు:1.ఇరుకుల్ల వేదప్రకాశ్‌ (53), మట్టెవాడ, వరంగల్‌. 2. మహ్మద్‌ సిద్దిక్‌ ఆలీ (46),లక్ష్మీ పురం, వరంగల్‌. 3. నూక రాజేష్‌ ఆలియాస్‌ రాజు (40),సుల్తాన్‌బాద్‌,పెద్దపల్లి జిల్లా. 4. యల్లం సదాశివుడు (57), కరీంనగర్‌. 5.యం.డి రఫీక్‌(50), గొవిందరావుపేట, ములుగు జిల్లా. 6. ఆళ్లచేరువు శేఖర్‌ (37),మడుగు,ప్రకాశం జిల్లా.ఆ.ప్ర. 7.పొదిళ్ళ సాంబయ్య (55), దుగ్గొండి,వరంగల్‌ జిల్లా. 8. విష్ణు వర్థన్‌ (ప్రస్తుతం పరారీలో వున్నాడు). 9.ముద్దగుల ఆదిత్య (32),హైదరాబాద్‌(ప్రస్తుతం జైలులో వున్నాడు).

ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ వివరాలు వెల్లడిస్తూ.. పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ మరియు మట్టెవాడ పోలీసులు, వ్యవసాధికారులు సంయుక్తంగా కలిసి మట్టెవాడ బోడ్రాయి ప్రాంతం లోని ప్రధాన నిందితుడు ఇరుకుళ్ళ వేదప్రకాశ్‌ ఇంటిపై దాడి చేసి మరో ముగ్గురు నిందితులు సిద్దిక్‌, రాజేష్‌, సదాశివుడు లను పోలీసులు అదుపులోకి తీసుకోని ఇంటి నుండి పెద్ద మొత్తం నకిలీ మరియు గడువు తీరిన పురుగు మందులను స్వాధీనం చేసుకొని నిందితులను మట్టెవాడ పోలీస్‌ స్టేషన్‌కు తరలించిన అనంతరం పోలీసులు నిందితులను విచారించగా ప్రధాన నిందితుడైన ఇరుకుళ్ల వేదప్రకాశ్‌ సులభంగా డబ్బు సంపాదించాలనే అలోచన తో నిందితుడు స్థానికంగా వుండే పురుగు మందుల వ్యాపారస్తుల నుండి పెద్ద మొత్తంలో కాలం తీరిన పురుగు మందులను కోనుగొలు చేయడంతో పాటు స్థానిక పురుగు మందుల కంపెనీ ప్రతినిధి అయిన మరో నిందితుడు సిద్దిక్‌ వద్ద కొనుగొలు చేసేవాడు. ఈ విధంగా కొనుగోలు చేసిన గడువు తీరిన పురుగు మందులతో పాటు, మరో ఇద్దరు నిందితులైన ఆళ్ళచెరువు శేఖర్‌, విష్ణువర్ధన్‌, ప్రస్తుతం జైలులో వున్న ఆదిత్యల నుండి ప్రముఖ పురుగు కంపెనీలైన దనూక, టాటా, రైల్స్‌, బెయర్‌, అడ్మా తో పాటు మరికొన్ని కంపెనీ పేర్లతో తయారు చేసిన నకిలీ పురుగు మందులను కొనుగోలు చేసేవాడు. ఈ విధంగా సేకరించిన గడువు తీరిన పరుగు మందులతో పాటు, నకిలీ పురుగు మందులను ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేని మిగితా నిందితులకు విక్రయించాడు. ఈ నకిలీ పురుగుల మందులను కొనుగొలు చేసిన నిందితులు వీటిని స్థానికంగా వున్న వ్యవసాయ దారులకు విక్రయిస్తూ మోసగించేవారు. పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన నిందితుడితో పాటు సదాశివుడు, రాజు, ఆదిత్య లు గతం లోను పలు కేసుల్లో నిందితులుగా వున్నారు. ప్రధాన నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఆళ్ళచెరువు శేఖర్‌, విష్ణువర్ధన్‌ల గౌడ లపై టాస్క్‌ఫోర్స్‌, మట్టెవాడ పోలీసులు దాడులు పెద్ద మొత్తం నకిలీ పురుగు మందులు, వీటి తయారికి వినియోగించే యంత్ర సామగ్రి, లేబుళ్ళు, కల్తీ విత్తనాలు, రెండు కార్లు, సెల్‌ఫోన్ల ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీ వ్యవహరాలో నిందితులను పట్టు కొవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్‌ ఫోర్స్‌, వరంగల్‌ ఏసిపిలు మధు సూదన్‌, నందిరామ్‌ నాయక్‌, ఇన్స్పెక్టర్లు ఎస్‌. రాజు, గోపి, ఎస్‌.ఐలు వంశీకృష్ణ, నవీన్‌, ఆర్‌.ఎస్‌.ఐ భాను ప్రకాశ్‌ , ఏఏఓ సల్మాన్‌ పాషా, టాస్క్‌ ఫోర్స్‌ కానిస్టేబుల్స్‌ సురేష్‌, సురేందర్‌, సాంబరాజు, శ్రీనివాస్‌, సతీష్‌ కుమర్‌, నాగరాజులను పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News