నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : గొల్లపల్లి మండల కేంద్రం లో ప్రజాసమస్యలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను ముందస్తు అరెస్టు లతో నిర్బంధిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.హైదరబాద్ లో అసెంబ్లీ ముట్టడి నేపథ్యం లో శనివారం రోజున విద్యార్థి విభాగ మండల అధ్యక్షుడు అవారి చందు నీ ముందస్తు అరెస్టు చేయడం జరిగింది.ఈ సందర్భంగా అవారి చందు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో పోలీస్ లను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి రాచరిక పాలన సాగిస్తున్నారు అన్నారు.ప్రజా సమస్యల గురించి మాట్లాడితే ముందస్తు అరెస్టు లు అని నిర్భందించడం అప్రజాస్వామికం అని అన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే రానున్న రోజుల్లో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోడ్ల గంగాధర్,చింతకుంట శ్రీనివాస్, ఆవుల సాయి, దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు.





