Saturday, April 4, 2026

బాధ్యత మరిచిన తాజా, మాజీ ఎమ్మెల్యేలు

  • పరస్పర విమర్శలతో సమయం వృధా చేస్తున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి, మాజీ ఎమ్మెల్యే రసమయి
  • భాజపా మానకొండూర్ అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి

నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): మానకొండూర్ నియోజకవర్గంలో గత రెండు, మూడు రోజులుగా జరుగుతున్న సంఘటనలు దురదుష్టకరమని ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇద్దరూ కూడ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కాకుండా ఒకరినొకరు పరస్పర నిందారోపణలు చేసుకుంటూ హంగు ఆర్భాటలతో అక్కరకు రాని నిరసనలు, బలప్రదర్శనలు చేసుకుంటూ బాధ్యతలు మరచి ప్రవర్తించటం సిగ్గు చేటని భాజపా మానకొండూర్ అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి తెలిపారు. ఇకనైనా సమస్యల నుండి ప్రజల దృష్టి మరల్చడంలో పెట్టే శ్రద్ధ, సమస్యల పరిష్కారం మీద పెట్టి గన్నేరువరం నుండి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. లేదంటే,బిఆర్ఎస్ పైన ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసిన భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్ పార్టీని కూడ సమస్యల పైన గ్రామ, గ్రామన నిలదీసి ప్రజల పక్షాన నిలబడుతుందని హెచ్చరిస్తున్నామని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News