నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్) : ధర్మపురి మండలం నేరెళ్ళ గ్రామంలోని సాంబ శివుడి ఆలయంలో సీసీ కెమెరాల ఆవిష్కరణ జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో మరియు గ్రామంలో ఉన్న ప్రార్ధన మందిరాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని సూచించడంతో జగిత్యాల డిఎస్పి శ్రీ రఘు చందర్ సూచనల మేరకు శనివారం రోజున నేరెళ్ల గ్రామంలోని సాంబశివుడి ఆలయంలో అయిదు 5 సీసీ కెమెరాలను ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎ .రాం నరసింహారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐ ధర్మపురి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భద్రతపరంగా గ్రామాన్ని సురక్షితంగా ఉంచడానికి మరియు దేవాలయాలలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, నేరాలను అరికట్టే చర్యల్లో భాగంగా అందరూ తమ పరిసర ప్రాంతాల్లో మరియు దేవాలయాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు,ఇట్టి కార్యక్రమంలో ధర్మపురి సిఐ శ్రీ ఎ. రాం నరసింహ రెడ్డి,ధర్మపురి ఎస్ఐ ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.ఇట్టి సీసీ కెమెరాల ఏర్పాటులో సహకరించిన ఆలయ కమిటీ చైర్మన్ జాజాల రవీందర్ మరియు కమిటీ సభ్యులకు సిఐ గారు అభినందనలు తెలిపారు





