Saturday, April 4, 2026

దశాబ్ద కాలం పార్టీకి సేవలందించిన వారికే పదవులు

  • మల్యాల సుజిత్ కుమార్, కరీంనగర్ డీసీసీ ఉపాధ్యక్షులు

నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): కాంగ్రెస్ లో దశాబ్ద కాలం పాటు నుండి కష్టపడుతున్న కార్యకర్తలు ఎందరో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా గౌరవ మానకొండూర్ శాసన సభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ విశిష్ట సేవలు అందిస్తున్నారని, రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల అధ్యక్ష స్థానం మార్పు సాధారణ విషయమని అన్నారు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మల్యాల సుజిత్ కుమార్. గన్నేరువారం మండలంలో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ మీడియాలో జిల్లా అధ్యక్ష స్థానం పై వస్తున్న వార్తలపై మాట్లాడారు. ఎలాంటి అపోహాలు లేకుండా గ్రామ మండల స్థాయి కార్యకర్తలకు తగిన గుర్తింపు తొందరలో లభిస్తుందని, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ పదేళ్ల విశిష్ట సేవలు అందించిన వారిని క్యాటగిరి ఏ లో, అసెంబ్లీ ఎన్నికలముందు పార్టీ లో చేరి అధికారం లోకి రావడానికి తోడ్పాటు నిచ్చిన వారిని క్యాటగిరి బి లో, అధికారం వచ్చిన తరువాత పార్టీలో చేరిన వారిని కేటగిరి సి లో చేర్చడం జరుగుతుందని పార్టీ పదవులు నామినేటెడ్ పదవులు వాటికి అనుగుణంగా ఇవ్వడం జరుగుతుందని కాబట్టి కార్యకర్తలు అధైర్యపడొద్దని అన్నారు. వలసలు పార్టీలో ఉంటాయని కానీ జిల్లా అధ్యక్ష పదవి పై వలస వాదులు ఆశలు పెట్టుకోవద్దని సూచించారు. గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు శాసన సభ్యులు పరిస్థితులని చక్కబెట్టే పనిలో ఉన్నారని, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అలాగే పార్టీ లో జోడు పదవులు ఉండొద్దనే తీర్మానానికి అనుగుణంగానే నియామకాలు జరుగుతాయని సుజిత్ కుమార్ స్పష్టం చేశారు. ఈకార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మెర రవీందర్ రెడ్డి, గన్నేరువరం మండల అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి దేశరాజు అనిల్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ చాడ సతీష్ రెడ్డి,నాయకులు ఏలేటి సతీష్ రెడ్డి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News