- ముక్కిస రత్నాకర్ రెడ్డి
నేటి సాక్షి, బెజ్జంకి: రాజీవ్ యువ వికాస్ పథకంలో పేద రెడ్డిలకు అవకాశం కల్పించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ యువ వికాస్ పథకంలో ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ లతోపాటు పేద రెడ్డి లకు ఈ డబ్ల్యూ ఎస్ ద్వారా అవకాశం కల్పించినందుకు రెడ్డిలలో నిరుపేద రెడ్డి కుటుంబాలు బాగుపడడం జరుగుతుందన్నారు. ఈ పథకంలో రెడ్డిలను చేర్చినందుకు సహకరించిన మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ,ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.





