- రైతులను ఆదుకోవాలి – సాన వేణు

నేటి సాక్షి, బెజ్జంకి: అకాల వర్షాలు బెజ్జంకి మండలానికి తీవ్ర నష్టాన్ని తెచ్చాయి. శుక్రవారం కురిసిన భారీ వానకు పంటలు దెబ్బతిన్నాయి. బలమైన ఈదురు గాలులు, వడగండ్లతో వరి, మొక్కజొన్న, మామిడికాయలు నేలరాలాయి. అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని తెచ్చాయి. కాగా చేతికి వచ్చిన పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వారిని బిజెపి నాయకులు సాన వేణు పరామర్శించి మాట్లాడుతూ అటు సాగునీటి ఎద్దడి, ఇటు కరెంట్ కోతలతో సతమతం అవుతున్న రైతులకు ఈ ప్రకృతి విపత్తుతో పూర్తి స్థాయిలో నష్టపోయారు. వడగళ్ల వానతో పూర్తిస్థాయిలో నష్టం వాటిల్లిందనీ, రైతులకు నష్టపరిహారం అందజేసి రైతులను ఆదుకోవాలని, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టం జరిగిన రైతుల వివరాలు సేకరించుకోవాలి వారికి తగిన న్యాయం చేయాలనీ తెలిపారు.





