- బిఆర్ఎస్ సినియర్ నాయకులు నిమ్మశెట్టి విజయ్..
నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ) : రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఇందిరమ్మ రాజ్యంలో ఆక్రమ ఆరెస్ట్ లు,నిర్బంధాలు ఉండవు ఆనీ చెప్పి పదే పదే బిఆర్ఎస్ విద్యార్థి నాయకులను అరెస్టులు చేయిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును బిఆర్ ఎస్ సీనియర్ నాయకులు నిమ్మచెట్టు విజయ్, పోతూ అనిల్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నిమ్మశెట్టి విజయ్, పోతూ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థి సమస్యలపై పోరాడుతున్న టిఆర్ఎస్వి నాయకులను ఆర్దరాత్రి ఆరెస్ట్ లు చేయడం బాధాకరమని అన్నారు. విద్యార్ది పోరాటాలను పోలీసుల చేత ఆణివేయాలనీ రేవేంత్ రెడ్డి చూస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థి ఉద్యమాలను పోరాటాలకు తెలంగాణ ఉద్యమమే నాయకులకు స్ఫూర్తి అని ఆన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని బిఆర్ఎస్వి నాయకులు పేద విద్యార్థుల పక్షాన పోరాడతామని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ లో ధర్నాలను నిషేధిస్తూ జివో చేయడం ఉద్యామాన్ని లేకుండా చేయాలనీ నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆన్నారు. అధికారం లోకి రావడానికి విద్యార్థులకు,నిరుద్యోగులకు ఎన్నో హమీలను ఇచ్చారనీ వాటి అమలుకు పోరాడుతామని హెచ్చరించారు. నాడు ఉస్మానియా విద్యార్ది నాయకులను బీరు బిర్యానీ కి ధర్నా చేస్తారని ఆవమానించాడనీ నాడు తెలంగాణ ఉద్యమంలో ఆమరులైన వారిని అవమానించనట్లేననీ ఆనీల్ ఆన్నారు. నిరుద్యోగులు 59 జివో రద్దు చేయాలని పోరాడితే హస్టల్ లో పోలీసులను చోరబడి విద్యార్థిలను పోలిసులతో కోట్టించరనీ,ఆధికారంలోకి వచ్చిన యాడదిలోనే 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఆనీ చెప్పి నిరుద్యోగులు మొన్న నోటిఫికేషన్లు వద్దనీ మంత్రులు అంటున్నారని మరొక్కసారి హేళన చేస్తూ నిరుద్యోగులను మోసం చేయడమే ఆనీ అన్నారు. ఆరెస్ట్ చేసిన నాయకులలో తుమ్మల సందీప్,షేక్ పర్వేజ్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు నరాల శేఖర్,ముద్రకోళ వెంకన్న పాల్గొన్నారు.





