నేటి సాక్షి 05 మే పాములపాడు :- రైతుల సంక్షేమమే లక్ష్యంగా, ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను పాములపాడు మండలంలోని, కంబాలపల్లె గ్రామంలో జరిగిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న తహసిల్దార్ జి.సుభద్రమ్మ రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ భాస్కర్, వీఆర్వోలు శివన్న, మక్బూల్, మద్దిలేటి, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న, వీఆర్ఏలు నాయక్, తదితర రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొనడం జరిగింది.





