నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెరుగుతున్న సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కీలక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని సైబర్ వారియర్స్‌కు ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ శిక్షణలో భాగంగా సైబర్ నేరాల స్వరూపం, అవి ఎలా జరుగుతున్నాయి, ముందస్తుగా గుర్తించే విధానాలు, అలాగే ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలి అనే అంశాలపై అధికారులు సమగ్రంగా వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో నేరాల నియంత్రణలో సైబర్ వారియర్స్ పాత్ర కీలకమని స్పష్టం చేశారు.సైబర్ భద్రతపై అవగాహనకు ప్రాధాన్యంఅనంతరం జిల్లా ఎస్పీ నితికా పంత్ సైబర్ వారియర్స్‌కు ప్రత్యేక టీ-షర్ట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంచడంలో సైబర్ వారియర్స్ చురుకుగా పాల్గొనాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు డిజిటల్ సేఫ్టీపై మార్గదర్శనం చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో పాల్గొన్న అధికారులుఈ కార్యక్రమంలో డిసిఆర్బి సిబ్బంది, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ బుద్దె స్వామి, సైబర్ క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ దివ్య తదితరులు పాల్గొన్నారు.





