నేటి సాక్షి, ధర్మారం: ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో చదువుతున్న తుమ్మల మనోజ్ఞ అండర్-16 హై జంప్ విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో మూడో స్థానం సాధించి కాంస్య పథకాన్ని గెలుచుకున్నదని బుధవారం ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు. ఈనెల 10వ తేదీన హనుమకొండ జిల్లాలో నిర్వహించిన 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జంప్స్ మరియు త్రోస్ పోటీల్లో పాల్గొన్న తుమ్మల మనోజ్ఞ అండర్-16 విభాగంలో హై జంప్‌లో ప్రతిభ కనబరిచి మూడో స్థానాన్ని సాధించి కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థినిని ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు బైకని కొమరయ్య, మేకల సంజీవరావు, విద్యార్థిని తల్లిదండ్రులు అభినందించారు.





