Wednesday, May 13, 2026

**రైతు వద్దకు శాస్త్రవేత్తలు** 👉రాష్ట్రవ్యాప్తంగా శాస్త్రవేత్తల బృందాలు ఏప్రిల్ 27 నుండి మే 23 వరకు .’👉రైతు వద్దకు శాస్త్రవేత్తలు’ కార్యక్రమం ద్వారా రైతులకు సేవలు అందిస్తారు . 👉ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీయూ) తెలంగాణ వ్యవసాయ శాఖ సూచనలు.

నేటి సాక్షి చిలుకూరు సూర్యాపేట జిల్లా, చిలుకూరు మండల కేంద్రంలో రైతు వేదికలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ పి. రాజనీకాంత్, డాక్టర్ ఎస్. శ్రీనివాస్ నేతృత్వంలో ‘రైతు వానాకాలం సీజన్‌కు ముందు రైతులు విత్తన రకాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మరియు రసాయన ఎరువుల (ముఖ్యంగా యూరియా) మితిమీరిన వాడకం వల్ల నేల సారం తగ్గిపోతుందని, దీనివల్ల కలిగే అనర్థాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. రసాయన పిచికారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నూతన వరి వంగడాలు, సేంద్రియ వ్యవసాయం, పంట మార్పిడిపై శిక్షణ ఇచ్చారు.మండల వ్యవసాయ అధికారి శ్రీధర్ మాట్లాడుతూ నీటిని పొదుపుగా వాడుకుంటూ, పంటల సాగును ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు చంద్ర శేఖర్, శిరీష, వసీమ రైతులు పాల్గొని శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News