నేటి సాక్షి, కోహెడ :హుస్నాబాద్ లో జరిగిన బస్ ప్రమాదం లో మృతి చెందిన కోహెడ మండలం రామచంద్రా పూర్ గ్రామానికీ చెందిన జెరిపోతుల రాములు ( దావా రాములు)గారి కుటుంబ సభ్యులకు స్థానిక శాసన సభ్యులు,రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, నిన్నటి రోజున వారు దహన సంస్కార నిమిత్తం వారి భార్య జ్యోతి గారికి 10,000 రూపాయలు (ఆర్థిక సాయం) కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులతో పంపించారు.*
_అలాగే ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి వారికి తగిన న్యాయం చేస్తానని, కాంగ్రెస్ పార్టీ ఎల్లపుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని, పొన్నం ప్రభాకర్ గారు అమెరికా నుండి తెలిపారు.