నేటి సాక్షి న్యూస్ ఏప్రిల్ 17 పెద్దకడబూరు దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్న జనగణన-2027లో భాగంగా ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పెద్దకడబూరు ఎంఆర్ఓ వలిబాషా సూచించారు.ఈ విధానం ద్వారా ప్రతి కుటుంబం తమ ఇంటి వివరాలను స్వయంగా మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించబడిందని తెలిపారు. ఇందుకోసం అధికారిక వెబ్సైట్ www.se.census.gov.in� ద్వారా వివరాలు నమోదు చేయాలని సూచించారు.వెబ్సైట్లో నమోదు ప్రక్రియ పూర్తయ్యాక పొందే SE IDను తప్పకుండా భద్రపరచుకోవాలని, భవిష్యత్ అవసరాలకు అది ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రజలు ముందుకు వచ్చి ఈ డిజిటల్ విధానాన్ని వినియోగించుకోవడం ద్వారా జనగణన ప్రక్రియను సులభతరం చేయాలని ఆయన కోరారు.





