- – వేలాది మంది సమక్షంలో మైక్ అందుకొని ప్రసంగం
- – బాలుడిని మెచ్చుకున్న సందర్శకులు
నేటి సాక్షి, కరీంనగర్ : స్టేజ్ ఫియర్ మనందరికి ఉంటుంది.. వేలాది మంది సమక్షంలో మైక్ పట్టుకొని, మాట్లాడాలంటే.. అబ్బో.. అది మనతో కాని పని.. కానీ, కరీంనగర్‌కు చెందిన 5 ఏండ్ల ఆఖిబ్ మాత్రం మైక్ పట్టుకొని, మాట్లాడితే అందరూ మంత్రముగ్ధులు కావాల్సిందే.. భయం.. బిడియం లేకుండా తాను చెప్పాల్సింది స్పష్టంగా చెప్పేస్తాడు. ఆఖిబ్ తండ్రి ఆరిఫ్ దబీర్ మైక్రోసాఫ్ట్ కాంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఈ బుడతడు లక్ష్య్ స్కూల్లో చదువుతున్నాడు. ఇటీవల కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో లక్ష్య్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మునావర్ జమా ప్రేరణాత్మక కార్యక్రమంలో ఈ బుడతడు హాజరై, 20 వేల మందికి పైగా ప్రజల ముందు స్వాగత ప్రసంగం ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. చిన్నారిని అనేక మంది వీక్షకులు ప్రశంసించారు. అతని భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలిపారు. ఈ బాలుడి స్పీచ్ వీడియో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, మరికొందరు దానిని వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నారు.
https://www.facebook.com/share/r/CjyzofPSXCNfxP8N/?mibextid=4UDYQrhttps://www.facebook.com/share/r/CjyzofPSXCNfxP8N/?mibextid=4UDYQr