Monday, December 23, 2024

స్మార్ట్​సిటీ పనుల్లో జాప్యం లేకుండా చూడండి

  • పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోండి
  • సీడీఎం గౌతమ్​కు నగర కార్పొరేటర్ల వినతి

కరీంనగర్, సెప్టెంబర్​16: కరీంనగర్​స్మార్ట్​సిటీ అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా చూడాలని మున్సిపల్​అడ్మినేస్ట్రేషన్​డైరెక్టర్​గౌతమ్​ను స్థానిక ఎంఐఎం కార్పొరేటర్లు విన్నవించారు. ఏఐఎంఐంఎం అధ్యక్షుడు అసదుద్దీన్​ ఒవైసీ ఆదేశాల మేరకు బుధవారం సీడీఎంఏను కరీంనగర్​నగర పాలక సంస్థ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ డివిజన్లలో నెలకొన్న సమస్యలను వివరించారు. స్మార్ట్​సిటీలో భాగంగా 5వ, 27వ డివిజన్లకు దాదాపు రూ.9 కోట్ల రూపాయల వ్యయంతో రెండు డ్రైన్లకు టెండర్లు పూర్తయినా, పనులు ప్రారంభించలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సీఎం సహాయక నిధుల పనులు కూడా అసంపూర్తిగా ఉన్నాయని వివరించారు. దీనిపై సీడీఎంఏ సానుకూలంగా స్పందించాలని కార్పొరేటర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ అబ్బాస్​సమీ, ఫ్లోర్​లీడర్ అఖిల్​ఫేరోజ్, శర్ఫొద్దీన్, బర్కత్​అలీ, అజహర్​దబీర్, అలీబా, ఆతీన తదితరులు పాల్గొన్నారు.​

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News