Friday, April 3, 2026

రెడ్డి సామాజిక వర్గంలోని పేదలకు అవకాశం కల్పించాలి

  • రెడ్డి జేఏసీ మండల అధ్యక్షుడు ముక్కిస తిరుపతిరెడ్డి

నేటి సాక్షి, బెజ్జంకి: ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు రెడ్డి సామాజిక వర్గంలోని పేద యువతకు అవకాశం కల్పించాలని రెడ్డి జేఏసీ మండల అధ్యక్షుడు ముక్కిస తిరుపతిరెడ్డి తెలిపారు. శుక్రవారం బెజ్జంకిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గంలోనూ ఆర్థికంగా వెనుకబడిన యువతీ యువకులు ఉన్నారని, వారి స్వయం ఉపాధికి ప్రభుత్వం తోడ్పాటును ఇవ్వాలని సూచించారు. రెడ్డి కార్పొరేషన్ ను అమల్లోకి తీసుకువచ్చి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు లక్ష్మారెడ్డి, సుదర్శన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, లింగారెడ్డి, కొండల్ రెడ్డి, మహేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News