నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన జడల చంద్రశేఖర్ కు ఇటీవల నిర్వహించిన టీఎస్పీఎస్ పరీక్షల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా ఉద్యోగం పొందిన సందర్భంగా వారిని బీఆర్ఎస్ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లింగాల లక్ష్మణ్, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి బోనగం రాజేశం గౌడ్, ప్యాక్స్ వైస్ చైర్మన్ బండి రమేష్ యాదవ్, భారత రాష్ట్ర సమితి నాయకులు గుబిరే మల్లేశం, పట్టణ అధ్యక్షులు వంగల నరేష్,బొల్లం శ్రీధర్, విశ్రాంత ఉద్యోగులు వెంకట్ నర్సు,మాజీ ఏఎంసి డైరెక్టర్ రాగుల మహేష్, లింగాల బాబు, ఆకెన అశోక్, బోనగిరి నవీన్, కల్లూరి అజయ్,వాసీమల్ల రమేష్,సంగ నరేష్,రాగుల ప్రశాంత్, జడల సంపత్ తదితరులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.





