- జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : సమాజంలో మార్పు కోసం బాలిక సంరక్షణకు బైక్ ర్యాలీ నిర్వహించామని, బాలికా సంరక్షణకు మరిన్ని కార్య క్రమాలను నిర్వహించ నున్నట్లు హన్మకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటి బచావో, బేటి పడావో కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళా పోలీసులు, మహిళా ఉద్యోగులతో బైక్ ర్యాలీని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ వరకు నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ వద్ద సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా జెండా ఊపి ప్రారంభించార. ఈ ర్యాలీ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి మహిళా పోలీసులు, మహిళా ఉద్యోగులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా అంబేద్కర్ జంక్షన్, నక్కలగుట్ట, కాళోజీ జంక్షన్, అదాలత్ మీదుగా హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుంది. జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న ఈ ర్యాలీని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ బాలికా సంరక్షణ కోసం నిర్వహించిన ఈ ర్యాలీలో పాల్గొన్న మహిళా ఉద్యోగులు, మహిళా పోలీసులకు అభినందనలు తెలియజేశారు. బాలికా సంరక్షణ పై అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలిక సంరక్షణకు సంబంధించి మరిన్ని సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బాలిక సంరక్షణ కార్య క్రమాలను సమాజంలో మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి జయంతి మాట్లాడుతూ బేటి బచావో బేటి పడావో పథకం ప్రారంభమై పదేళ్లు పూర్తయిన సందర్భంగా మహిళా పోలీసులు మహిళా ఉద్యోగులతో బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. సమాజంలో మహిళలు విభిన్న రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. బాలికా సంరక్షణకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, డెమో అశోక్ రెడ్డి ,మహిళా పోలీస్ షీ టీమ్, భరోసా ఇన్స్పెక్టర్లు సుజాత, సువర్ణ, యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ పి వెంకన్న, సిడీపీవో ఎం విశ్వజ, బాల రక్షా భవన్ కో.. ఆర్డినేటర్ సిహెచ్ అవంతి, మెప్మా అధికారి రాజేష్ గౌడ్, జిల్లా మిషన్ శక్తి కో ఆర్డినేటర్ కళ్యాణి, బాలల పరిరక్షణ అధికారి సౌరం ప్రవీణ్ కుమార్, ఇతర అధికారులు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, జిల్లా మహిళా సాధికారత విభాగం, ఐసిపిఎస్, చైల్డ్ హెల్ప్ లైన్ విభాగాలు, అంగన్వాడీ టీచర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.





