నేటి సాక్షి: ప్రతినిధి వనపర్తి జిల్లా :జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ శక్తిపీఠమైన అల్లంపూర్లో వాసవినిత్య అన్నదాన సత్రంలో ఎలక్షన్స్ జరిగాయి కల్వ రమేష్ 40 ఓట్ల తోన విజయం సాధించినారు. వాసవి నిత్య అన్నదాన సత్రం కార్య సమావేశంలో వనపర్తి పట్టణ కన్యకా పరమేశ్వరి గుడి ఆర్యవైశ్య సంఘానికి ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన బచ్చు రాము కి ఘనంగా శాలువాలతో సన్మానించడం జరిగింది. వనపర్తి లో ప్రముఖ వ్యాపారవేత్త మారం బాల్లీశ్వరయ్య కి మరియు వనపర్తి ఆర్యవైశ్య సంఘ మాజీ కన్వీనర్ పూరి బాలరాజు కి వాసవి అన్నదాన సత్రానికి ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది.ఈ విధంగా వనపర్తి జిల్లాలో పెద్ద ఎత్తున వనపర్తి లో సేవ చేయడానికి ఆర్యవైశ్యులు ఎల్లప్పుడు ముందు ఉంటారన్నారు.రమేష్ అధ్యక్షులు సన్మానం చేయడం జరిగింది.మరి వనపర్తి ఆర్యవైశ్య గుడిని ముందుకు తీసుకెళ్లాలని అక్కడ ఆర్యవైశ్యులకు వాసవి ఫంక్షన్ హాల్ కట్టియాలని రమేష్, బచ్చు రాము కి వారి గద్వాల జోగులాంబజిల్లా నుండి తప్పకుండా సహకరిస్తామని చెప్పి తెలపడం జరిగింది. బచ్చు రాము మాట్లాడుతూ ఫంక్షన్ హాల్ ఆర్యవైశ్యులకే కాదు ఇతర కులాల కు కూడా అతి తక్కువ డబ్బులకు కిరాయి ఇవ్వబడునని తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో లెగిసెట్టి సాయి ప్రసాద్, ఎల్ అశోక్, కేకే మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

