నేటి సాక్షి, దోమ.సురేష్ మోత్కూర్.దోమ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు కే.రాజిరెడ్డి,సీనియర్ నాయకులు లక్ష్మయ్య,మండల అధ్యక్షులు గోపాల్ గౌడ్,వార్డ్ సభ్యులు మైనొద్దీన్, కోసునం శ్రీనివాస్ రెడ్డి.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లో అవకతవకలు జరిగినాయనేది పాలన చేతగాక ప్రజల దృష్టి మళ్లించేందుకు రాజకీయ ప్రేరేపిత అభియోగాలని రుజువైంది.కేసీఆర్ గారి మీద కమిషన్ పేరుతో వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ ఎత్తుగడ హై కోర్టు ముందు తుస్సుమన్నది అని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారు తెలిపారు.జస్టిస్ పి సి ఘోష్ కమిషన్, కేసీఆర్ కాళేశ్వరం విచారణ పేరుతో వ్యవహరించిన తీరు,ప్రాథమిక న్యాయ సూత్రాలకు,రాజ్యాంగపర హక్కులకు విరుద్ధమని గౌరవ న్యాయస్థానం స్పష్టం చేసింది.రాష్ట్రంలోనీ ప్రజలు 𝐊𝐂𝐑 గారి పాలనను కోరుకుంటున్నారు.రానున్న రోజుల్లో 𝐊𝐂𝐑 గారి రాజ్యం రానుందనీ వారు తెలిపారు..





