నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలోని అమరవాయి గ్రామంలో నేడు అంగన్వాడి సెంటర్లో నూతన శిశువులకు అక్షర అభ్యాసంపిల్లలతల్లిదండ్రులతోపాటు అంగన్వాడీ టీచర్లు శిశువులకు అక్షర అభ్యాసం నిర్వహిస్తూ..మన అంగన్వాడి సెంటర్ శిశువులకు దేవాలయం లాంటిది అన్నారు. మరియు అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ..నూతన శిశువులను అంగన్వాడి సెంటర్కు అలవడి చేసుకునే బాధ్యత మాపై 100% ఉంటుందని అన్నారు. శిశువులకు ప్రతి సంవత్సరం అక్షర అభ్యాసం జరపాల్సిందే అన్నారు. చిన్న శిశువులను మూర్తిమత్వ భావాలు సృజనాత్మకత అలాగే ఆట పాటతో అలంకరించే విద్యా ప్రమాణాలతో పిల్లలకు నేర్పుతామని వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ.. అన్నప్రాస ద్వారా శిశువులకు,బాలింతలకు, కిశోర బాలికలకు, ఆహార పదార్థాలు, పాలు, గుడ్డు, అన్నం, అన్నప్రాస జరుపుతాము అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో పరశురాముడు సూపర్వైజర్ వాసంతి అంగన్వాడీ టీచర్లు పద్మ, తిమ్మమ్మ,యశోద, హెల్పర్ తిమ్మలమ్మ,తదితరులు పాల్గొన్నారు.

