నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : మంగళవారం హైదరాబాదులోని భీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వనం మహేందర్ ని మాచర్ల ప్రకాష్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా మాచర్ల ప్రకాష్ ని భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జిగా నియామక పత్రం అందచేసి నియమించారు ఈ సందర్భంగా భీమ్ ఆర్మీని విస్తృత పరిచి, బలోపేతానికి కృషి చేయాలని అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం, బహుజన వాదం కోసం పనిచేయాలని తెలియజేశారు, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ నాయకత్వాన్ని బలపరచాలని తెలిపారు
ఈ సందర్భంగా మాచర్ల ప్రకాష్ మాట్లాడుతూ : నాకు ఇచ్చిన బాధ్యతను నా శక్తి సామర్థ్యం ఉన్నంతవరకు దళిత వర్గాల కోసం పోరాడి అంబేద్కర్ సేవలను విస్తృతంగా ప్రచారం చేస్తానని అన్నారు

