నేటిసాక్షి,; రాయికల్ : రాయికల్ మండలం అల్లీపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు కాసం శ్రీనివాస్ కంప్యూటర్ను మంగళవారం అందజేసారు. ఇదే పాఠశాలలో సాంఘీక శాస్త్రం టీచర్గా పని చేసిన కాసం మురళి జ్ఞాపకార్థం మురళి కుమారుడు కంప్యూటర్ను అందించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గణేష్, చంద్రమోహన్, కమాలాకర్, హెచ్ఎం గుర్రం శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపిటిసి మోర విజయలక్ష్మి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. ఫోటో రైటప్: 17RKL02: కంప్యూటర్ను అందిస్తున్న దృశ్యం

