Tuesday, April 28, 2026

ఎం పి ఓ శ్యాంసుందర్ రెడ్డి కి ఘన సన్మానం ఘనంగా వీడ్కోలు సత్కార సమావేశం…..

నేటి సాక్షి నారాయణపేట, ఏప్రిల్ 28,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం నాడు మరికల్ గ్రామ సర్పంచ్ చెన్నయ్య ఆధ్వర్యంలో మరికల్ గ్రామపంచాయతీ కార్యదర్శి గా పనిచేసిన శ్యాంసుందర్ రెడ్డి కి ఎంపీ ఓ గా ప్రమోషన్ పై వెళుతున్న సందర్భంగా వీడ్కోలు సత్కార సభ సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మరికల్ మండల తాసిల్దార్ రామకోటి, మండల ఎంపీడీవో పృథ్విరాజ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తూ గ్రామాలలో మంచి పేరు ను పొందాలన్నారు. అనంతరం వారి అధ్వర్యంలో శ్యాంసుందర్ రెడ్డి కి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మరికల్ గ్రామ సర్పంచ్ చెన్నయ్య ఆధ్వర్యంలో శాలువాలతో పూలమాలలతో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్య మోహన్, నాయకులు కార్యకర్తలు, అఖిలపక్ష నాయకులు మరికల్ గ్రామ వార్డు సభ్యులు గ్రామపంచాయతీ సిబ్బంది ఆధ్వర్యం లో శాలువలతో పూలమాలలతో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News