సిరిసిల్ల రిపోర్టర్ శివకుమార్ ఏప్రిల్ 28:-బిఆర్ఎస్‌పై విమర్శలు చేసే నైతిక అర్హత సీఎంకు లేదు: కంచర్ల రవి గౌడ్ ఫైర్బిఆర్ఎస్ పార్టీపై ముఖ్యమంత్రి చేసిన విమర్శలు రాజకీయ దివాళా తనానికి నిదర్శనమని టిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు టిఆర్ఎస్‌పై అబద్ధ ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో చరిత్ర సృష్టించిన టిఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు ముఖ్యమంత్రికి లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.ప్రజల కోసం పుట్టిన పార్టీని కించపరచడం ద్వారా ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానిస్తున్నారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, అందుకే దృష్టి మళ్లించేందుకు బిఆర్ఎస్‌పై దాడులు చేస్తోందని విమర్శించారు.ఇటువంటి రాజకీయాలకు ప్రజలు సరైన సమయంలో గట్టి తీర్పు ఇస్తారని హెచ్చరించిన ఆయన, బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ తెలంగాణ ప్రజల పక్షాన నిలుస్తుందని, ప్రజల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్.కె అప్రోచ్ ఆరేల్లి వినయ్ కుమార్ శ్రీనివాస్ సాయి శ్రీకర్ వినయ్ నరేష్ రాము వినయ్ యశ్వంత్ దామోదర్ అనిల్ భాను రాము తదితరులు పాల్గొన్నారు





