నేటిసాక్షి,నారాయణపేట, జూన్ 18, నారాయణపేట జిల్లాలోని మరికల్ మరికల్ మండల పరిధిలోని తీలేరు గ్రామంలో గల చత్రపతి శివాజీ విగ్రహానికి భీష్మ ఫౌండేషన్ అధినేత రాజ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలతో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీష్మ ఫౌండేషన్ కమిటీ సభ్యులు పెద్ద కురుమన్న, ఆశన్న, వెంకటన్న,శ్రీనివాసులు, రామచంద్రయ్య,వైబన్న, కురుమన్న, సంతోష్ కుమార్, గోవర్ధన్, హనుమంతు, నందు తదితరులు పాల్గొన్నారు.

