జిహెచ్ఎంసి కమిషనర్ ఆదేశాల మేర కు స్పెషల్ డ్రైవ్ లో నిర్వహించిన జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బంది
నేటి సాక్షి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి
జూన్ 19
జిహెచ్ఎంసి కమిషనర్ ఆదేశాల మేరకు రాబోవు వర్షాకాలం యందు ప్రజారోగ్యము పారిశుద్ధ్య విషయమై ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకొని జిహెచ్ఎంసి అన్ని సర్కిల్ ల యందు ముందస్తు వర్షాకాల ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించినందున, అందులో భాగంగా గురువారం ఉప్పల్ సర్కిల్ ఉప్పల్ డివిజన్ యందు వెంకటేశ్వర స్వామి కమాన్ రోడ్డు కార్యక్రమాన్ని కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇందిరా నగర్ విజయపురి కాలనీ సాయిరాం కాలనీ శేష సాయి నగర్ మల్లికార్జున నగర్ చర్చ్ కాలనీ మొదలగు కాలనీల యందు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కాలనీల రోడ్లను ఖాళీ ప్రదేశాలను శుభ్రం చేసి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి చెత్తను ఎత్తివేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప్పల్ సర్కిల్ పారిశుద్ధ్య విభాగం డి ఈ చందన చౌహాన్ ఎస్ ఎఫ్ ఏ లు జవాన్లు పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు .ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్పోరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు వారి ఇంటి నుండి వ్యాపార స్థలాల నుండి వెలువడే చెత్తాచెదారాన్ని ఎక్కడపడితే అక్కడ పడ వేయకుండా జిహెచ్ఎంసి స్వచ్ఛ ఆటో వారికి అందించాలని ఎక్కడపడితే అక్కడ పడవేయడం వలన వర్షాకాలంలో నాళాలు మోరీలు చెత్తతో నిండిపోవడం వలన వర్షం నీరు కాలనీలలో నిలిచిపోయి దుర్వాసన ప్రాణాంతకమైన అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున ప్రజలందరూ ఈ సూచనలను పాటించాలని ఇంటి ప్రాంగణంలో చుట్టుపక్కల నీరు నిరువకుండా అందువల్ల దోమలు అభివృద్ధి చెందకుండా మన వంతు బాధ్యతగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ పెద్దలు, రజిత పరమేశ్వర్ రెడ్డి జిహెచ్ఎంసి చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్ కు కాలనీల నుండి వారి వంతు సహకారం అందించాలని తెలియజేశారు .





