ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసిన జర్నలిస్ట్ శ్రీకాంత్
ఎన్నో రోజుల నుండి పెద్దపులి నాగారం గ్రామంలో.. కరెంటు సమస్య
నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామంలో… ఏడ వార్డు ఆరోవ వార్డు మధ్యలో మూడు స్తంభాలకు గాను గత మూడు సంవత్సరాల నుండి సమస్య ఉందని మహేశ్వరం ఏ ఈ చక్రపాణి దృష్టికి సీనియర్ జర్నలిస్ట్ చిక్కిరి శ్రీకాంత్ తెలియజేయడం జరిగింది వెంటనే స్పందించిన ఏ ఈ చక్రపాణి తన సిబ్బందితో… ఒకరోజు ముందు లైన్ మెన్ శ్రీనివాస్ ని మరియు బిల్ కలెక్టర్ వెంకటేష్ ని పంపించి అక్కడ ఉన్న సమస్యను గమనించి వెంటనే జూన్ 19 2025 గురువారం రోజున ఆ యొక్క సమస్యకు విముక్తి కల్పించడం జరిగింది వెంటనే స్పందించి కరెంటు సమస్యను తీర్చినందుకు సీనియర్ జర్నలిస్ట్ చిక్కిరి శ్రీకాంత్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది మరియు బస్తివాసులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది

