Monday, March 9, 2026

ప్రజా ప్రభుత్వంలో క్రీడలకు పెద్దపీట…- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..

మూడపల్లి గ్రామంలో మినీ స్టేడియం నిర్మాణం కోసం స్థల పరిశీలన….ప్రజా ప్రభుత్వంలో క్రీడలకు పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డితో కలిసి మినీ స్టేడియం కోసం స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ఆటలు ఆడటం వల్ల శారీరక దృఢత్వం లభిస్తుందనీ తెలిపారు. మన ప్రాంతంలో అనేక మంది క్రీడాకారులకు నిలయంగా మారిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు పెద్దపీట వేస్తోందని అందులో భాగంగా వేములవాడ నియోజకవర్గ పరిధిలో మూడపల్లి గ్రామంలో 6 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. వేములవాడ లో ఆగిపోయిన మినీ స్టేడియం పనులు, సిరిసిల్ల లో మినీ స్టేడియం నిర్మాణం కోసం భూమి సేకరణ పూర్తైందన్నారు.ఎల్లపుడూ క్రీడాకారులకు తన వంతు సహాయ సహారాలు ఉంటాయని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి వాలీబాల్, కబడ్డి పోటీలు జిల్లా పరిదిలో తన వంతు ప్రోత్సాహకం ఉంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాలకు పెద్ద పీట వేస్తన్నరని అందులో భాగంగా రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.క్రీడాకారులు జీవితంలో ఏమైనా సమస్యలు ఎదురైతే వాటిని ఎదుర్కొనే ధైర్యం ఎక్కువగా ఉంటుందన్నారు. సిరిసిల్ల ప్రాంతంలో మంత్రుల చేతుల మీదుగా అనేక అభివ్రుద్ది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిoదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనీ క్రీడాకారులను వేలికి తీయడానికి సీఎం కప్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు పేర్కొన్నారు.శివ సేన రెడ్డి మాట్లాడుతూ….తన స్పోర్ట్స్ చైర్మన్గా నియామకం అయిన నాటి నుండి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ నియోజకవర్గం లో మినీ స్టేడియాల నిర్మాణం చేయవలసిందిగా కోరుతున్నారు. ఆయన కృషి ఫలితంగా నేడు వేములవాడ నియోజకవర్గం లో రెండు స్టేడియాలు మంజూరు అయ్యాయి.గత ప్రభుత్వం క్రీడాకారులను క్రీడలను ఏమాత్రం పట్టించుకోలేదు. వారు 10 సంవత్సరాల కాలంలో క్రీడలకు 400 కోట్లు కేటాయిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం లో 11 నెలల్లోనే 800 కోట్లు కేటాయించడం జరిగినట్టు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో క్రీడా సామాగ్రిని అందుబాటులో ఉంచి గ్రామాల్లో నుంచి ఒలంపిక్ లో ఆడేలా మెరికల్ లాంటి క్రీడాకారులను తయారు చేయునున్నట్లు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News