నేటి సాక్షి, గన్నేరువరం,(బుర్ర అంజయ్య గౌడ్):
గన్నేరువరం మండలంలోని కూనవానిపల్లిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, పోల్ విరిగిపోయి విద్యుత్ తీగలు ఒకదానిపై ఒకటి పడి మోటర్లు కాలిపోతున్నాయని శుక్రవారం ట్రాన్స్ఫార్మర్ వద్ద స్థానిక రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ పోల్స్ విరిగి 11 కెవి వైర్లు ఒకదానిపై ఒకటి పడి మోటార్లు కాలిపోతున్నాయని, నారు పోసే టైములో నారుమడులు ఎండిపోతున్నాయని మండల ఏఈ అధికారులకు చెప్పిన స్పందించడం లేదని వాపోయారు. తక్షణమే ట్రాన్స్ఫార్మర్ వద్ద విరిగిన విద్యుత్ స్తంభాన్ని మార్పిడి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోయిని బాలయ్య, కున యాదగిరి, కూన చంద్రశేఖర్, విజేందర్, లచ్చయ్య రాజు , తదితరులు పాల్గొన్నారు.





