ప్రతి బూతు అధ్యక్షులు ఒక సైనికుడిలా పని చేసి స్థానిక ఎలక్షన్లకు సిద్ధంగా ఉండాలి.
బిజెపి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి.
నేటి సాక్షి, నర్సంపేట, జూన్ 21:భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల సేవా – సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బిజెపి ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మకమైన నిర్ణయాలను ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేసేలా శనివారం నర్సంపేట పట్టణం నర్సంపేట మండలం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ , మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ ల అధ్యక్షతన నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా బీజేపీ వరంగల్ జిల్లా ప్రధానకార్యదర్శి, నర్సంపేట నియోజకవర్గ నాయకులు డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లడుతూ.భారత ప్రధాని నరేంద్ర మోడీ అధికారం చేపట్టి 11 సంవత్సరాలు వికసిత్ భారత్ అమృతకాలం సేవా – పరిపాలన, సుపరిపాలన సందర్భంగా దేశ ప్రధాని తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయాలను పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా రచ్చబండ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు విస్తృత ప్రచారం చేస్తూ, అదేవిధంగా రాబోయే స్థానిక ఎలక్షన్లకు సిద్ధంగా ఉండాలి ప్రతి బూత్ అధ్యక్షులు ఒక సైనికుడి గా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మోడీ ప్రభుత్వం డిజిటల్ ట్రాన్సాక్షన్ లో 100 శాతం అధిగమించి. భారత ప్రభుత్వం 40శాతం సంకల్పం సాధించిందని చెప్పారు. మోడీ ప్రభుత్వం 80 శాతం ప్రజలకు ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం చొప్పున ఆహార భద్రత కార్డు కలిగిన ప్రజలందరికీ ఉచితంగా అందిస్తుందన్నారు. 370 ఆర్టికల్ భారతదేశంలో అంతర్భాగం అని దీనిని ఎవరు విడదీయరన్నారు. అయోధ్య రామ మందిరం పూర్తి చేయడంలో ప్రధానమంత్రి మోడీ కృషి అమోఘం అన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదాన్ని నలిపివేశారని ఇది మోడీ ప్రభుత్వం ఘనత అన్నారు. 2014 నుండి 2024 వరకు రైతులకు బిజెపి ప్రభుత్వం చేపట్టి న ఎంఎస్పి ద్వారా రైతులు రెట్టింపు ఆదాయం పొందారని పేర్కొన్నారు. పిఎం కిసాన్ ద్వారా దేశంలో 12 కోట్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అనంతరం వరంగల్ జిల్లా ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నర్సింహ రాములు ,జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ ,జిల్లా ఎస్సీ మోర్చా కో కన్వీనర్ కునమల్లా పృథ్వీ ,జిల్లా కౌన్సిల్ మెంబర్ పొదిల్లా రామ్ చందర్ ,జిల్లా నాయకులు మల్యాల వినయ్ ,కుంభం కోమల్ రెడ్డి ,శీలం.సత్యనారాయణ పట్టణ,మండల కమిటీ సభ్యులు బూత్ అధ్యక్షులు,సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.





