నేటి సాక్షి :జిన్నారం వీరభద్ర స్వామి దేవాలయంలో అడిషనల్ డైరెక్టర్ ప్రత్యేక పూజలు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్ర అడిషనల్ డైరెక్టర్ సంతోష్ కుమార్ పాండే, శనివారం బొంతపల్లిలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి , ఈవో శశిధర్, లు సంతోష్ కుమార్ పాండేను, ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. వీరభద్ర స్వామి సన్నిధిలో అభిషేకం, అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరభద్ర స్వామి కృపతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సంతోష్ కుమార్ పాండే ఆకాంక్షించారు. అనంతరం ఆలయ అర్చకులు అధికారులకు ఆశీర్వచనాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సోమయ్య, అర్చకులు పాల్గొన్నారు.

