నేటి సాక్షి – జగిత్యాల జిల్లా స్టాఫర్
( గుండ ప్రశాంత్ గౌడ్ )
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రం లో గౌడ సంఘం వారు తాళ్ల మండవ లో నీటి సమస్య ఉందని స్థానిక కాంగ్రస్ నాయకులకు తెలియచేయగా అట్టి విషయాన్ని ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలియచేయగ వెంటనే స్పందించి ఆదివారం రోజున బోర్ బండిని పంపించి బోర్ వేయించడం జరిగింది. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులంతా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మరియు సహకరించిన బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు

