31 వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి బక్కని రవి మాదిగ నేటి సాక్షి ; ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్) రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ మహేశ్వరం మండల కేంద్రంలోని గొల్లూరు మరియు దుబ్బచర్ల గ్రామాలలో మాదిగ చైతన్య సమావేశాలలో ఎమ్మార్పీఎస్ మండల్ ఇన్చార్జి బక్కని రవి మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది రవి మాదిగ మాట్లాడుతూ… కులాలుగా చైతన్యం కావాలి – సమూహంగా ఏకం కావాలి.ఎమ్మార్పీఎస్ ఉద్యమం అట్టడుగు వర్గాలకు కేంద్రబిందువు.జాతిని నడిపించాం.. గెలిపించాం ఇగ సమాజాన్ని నడిపిద్దాం.. రాజకీయ చైతన్యాన్ని నింపుతూ అన్ని వర్గాల హక్కుల కోసం ఉద్యమిద్దాం.ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగళ్ల ఉపేందర్ మాదిగ.ఈ దేశ కుల వ్యవస్థలో అణగారిపోయిన కులాలన్ని ఏ కులానికి ఆ కులం సామాజిక చైతన్యమై అంతిమంగా మహాజన సమూహంగా అన్ని కులాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా ఇంచార్జి రాగళ్ల ఉపేందర్ మాదిగ అన్నారు మహేశ్వరం మండల పరిధిలోని గొల్లూరు, దుబ్బచర్ల గ్రామాల్లో మాదిగల చైతన్య సమావేశాలు ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి బక్కని రవి మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు రావుగళ్ళ బాబు మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు పెంటనోళ్ల నరసింహా మాదిగ, ఎంఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెడుపల్లి రఘువరన్ మాదిగ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న “రాగల్ల ఉపేందర్ మాదిగ” మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ మొదలుపెట్టిన ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రభావం అన్ని అణగారిన కులాల్లో సామాజిక చైతన్యానికి రగిలించిందని అన్నారు. ప్రతి కులం తమ అస్తిత్వాన్ని చాటుకోవడానికి సంఘాల ఏర్పాటు చేసుకొని పోరాట బాటలోకి వచ్చాయని అన్నారు.వారికి కావాల్సినంత ప్రోత్సాహాన్ని సహకారాన్ని మందకృష్ణ మాదిగ అందించారు. అందువల్ల ఎమ్మార్పీఎస్ ఉద్యమం కేవలం మాదిగల ప్రయోజనాల వరకే పరిమితం కాకుండా అన్ని అణగారిన కులాల సంక్షేమం కోసం కృషి చేసిందని అన్నారు. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ, ఆసరా పెన్షన్లు, రేషన్ బియ్యం పెంపు,తెలంగాణ అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు, మహిళల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మొదలైనవి ఎమ్మార్పీఎస్ పోరాడి సాధించిందని అన్నారు. ఈ ఫలితాల అన్ని వర్గాలు పొందుతున్నారని అన్నారు.అందువల్ల సమస్త అణగారిన కులాలకు కేంద్ర బిందువుగా ఎమ్మార్పీఎస్ నిలుస్తుందని అన్నారు.మూడు దశాబ్దాలుగా ప్రజల గొంతుకగా అలుపెరుగని పోరాటాలు చేస్తూ ప్రజల హృదయాల్లో నేటికి సజీవంగా బ్రతికున్న ఏకైన ఉద్యమం ఎమ్మార్పీఎస్ ఉద్యమం అని, పోరాటాల ద్వారా జాతిని నడిపించాం.. గెలిపించాం, ఇగ సమాజాన్ని నడిపిద్దాం.. రాజకీయ చైతన్యాన్ని నింపుతూ అన్ని వర్గాల హక్కుల కోసం ఉద్యమిద్దామని, అందుకు నిర్మాణాత్మకంగా బలపడి పీడింపబడుతున్న వర్గం పక్షాన అసమానతలు లేని నూతన సమాజ నిర్మాణమే లక్ష్యంగా దేశవ్యాప్త ఉద్యమంతో ముందుకు సాగుదామని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అణగారిన కులాలన్ని ఏ కులానికి ఆ కులం చైతనమై మందకృష్ణ మాదిగ నేతృత్వంలో మహజనులుగా ఏకమై తెలంగాణ రాజకీయల్లో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆ దిశగా అన్ని కులాలు ఆలోచించాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటం విజయం సాధించిన నేపథ్యంలో జూలై 7న జరుగు ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని అన్ని గ్రామాల్లో అన్ని కులాల సమక్షంలో పెద్ద ఎత్తున జరుపుకోవాలని, ఉద్యమానికి సహకరించిన ప్రతి వ్యక్తికి కృతజ్ఞతగాసన్మానించుకోవాలనిపిలుపునిచ్చారు.ఎమ్మార్పీఎస్ దుబ్బచర్ల గ్రామ కమిటీ. గ్రామ అధ్యక్షులు: ఎర్ర శ్రీధర్ మాదిగ ఉపాధ్యక్షులు:- నడ్డి అరవింద్ మాదిగ ఎర్ర రాజు మాదిగ ప్రధాన కార్యదర్శి: పోట్టగళ్ళ జయరాజు మాదిగకార్యదర్శి:- నరసింహ మాదిగసహాయ కార్యదర్శి: నడ్డి నరేష్ మాదిగ ప్రచార కార్యదర్శి:జుట్టు రమేష్ మాదిగ కోశాధికారి: అంబేద్కర్ మాదిగసలహాదారులు:- ఎర్ర జగన్ మాదిగ, పోట్టగల శేఖర్ మాదిగ ఎంఎస్ఎఫ్ గ్రామ కమిటీఅధ్యక్షులు :- నడ్డి సాయికుమార్ మాదిగ ఉపాధ్యక్షులు:- పోట్టగల్ల రాజేష్ మాదిగ ప్రధాన కార్యదర్శి: గాదేకాటి మధు మాదిగకార్యదర్శి : బన్నీ మాదిగ ఎం వై ఎస్ యువసేన కమిటీఅధ్యక్షులు:- నడ్డి శామ్యూల్ రాజు మాదిగ ఉపాధ్యక్షులు:- పొట్టగల రాజేష్ మాదిగ ప్రధాన కార్యదర్శి: నడ్డి సురేష్ మాదిగ ఎమ్మెస్ పి కమిటీఅధ్యక్షులు:- నడ్డి గోపాల్ మాదిగ ఉపాధ్యక్షులు:- జె. రమేష్ మాదిగ మరియు అనుబంధ విభాగాల కమిటీలను ఎన్నుకోవడం జరిగింది.





