Monday, March 9, 2026

ప్రజా సమస్యలపై సమరశీల పోరాటలు నిర్వహించాలి

పెగడపల్లి మండల నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నికలో పాల్గొన్న ఇరుగురాల భూమేశ్వర్..

పెగడపల్లి కె గంగాధర్)నేటిసాక్షి

పెగడపల్లి మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో సిపిఐ 9వ మండల మహాసభను నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇరుగురాల భూమేశ్వర్ హాజరై మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వ కార్యాలయాల ముందు సమరశీల పోరాటాలు ఉద్యమాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హులైన
పేదలకు ఇల్లు మంజూరు చేయాలని కోరారు. రాజీవ్ యువ వికాసం పథకంలో పారదర్శకతను పాటించాలని. గత ప్రభుత్వాల విధానాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పటిష్టంగా చొరవ తీసుకోవాలన్నారు. ఒక శతాబ్దం పూర్తి చేసుకున్న పార్టీ నాటి నుండి నేటి వరకు ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుంది అన్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తులకు దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ సిపిఐ పార్టీ అన్నారు. అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇళ్ల స్థలాల కోసం భూ పోరాటాలు చేయాలన్నారు. సిపిఐ పార్టీ సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు ఎత్తుపల్లాలను చూసిందని. సమస్యలు ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీ నిరంతరం ప్రజల కోసం పోరాడుతుంది అన్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక పోరాట త్యాగాల గుర్తులు ఉన్నాయని అన్నారు.నూతన కార్యవర్గం లో కార్యదర్శి గా శనిగరపు ప్రవీణ్, రాచర్ల సురేష్ సహాయ కార్యదర్శి , గుడ్ల శ్రీనివాస్, కోశాధికారిగా దీకొండ రవికుమార్, ఎన్నుకోబడ్డారు ఈ కార్యక్రమం లో బొమ్మన శంకర్, బొమ్మన బాబు, శ్రీగిరి రాజకుమార్, ఆత్మకూరి రాజేశం, సిపల్లి బాబు, బత్తుల రామకృష్ణ, కోలాపురి హనుమంతు, మల్యాల అంజయ్య, మల్లారపు భూమయ్య, మల్యాల ఎర్రయ్య, నాగవత్ గంగానాయక్, లింగంపల్లి కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News