నేటి సాక్షి, నారాయణపేట, జూన్ 25, నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం వివిధ గ్రామాల గ్రామపంచాయతీ కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నారాయణపేట జిల్లా డిఆర్డిఏ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. పంచాయతీ కార్యదర్శులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఉపాధి హామీ పనులకు సంబంధించి పలు సమస్యలు 15 దాకా రాసి ఇవ్వాలని ఆయన పంచాయతీ కార్యదర్శులను కోరారు. రెండు రోజుల్లోపు పూర్తిస్థాయిలో నివేదికలను అందజేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆయన కోరారు. ఇట్టి విషయంపై పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ధన్వాడ మండలం ఎంపీడీవో సాయి ప్రకాష్ శెట్టి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.





