నేటిసాక్షి (కె గంగాధర్)పెగడపల్లి
పెగడపల్లి మండలం బతికేపెల్లి గ్రామానికి చెందిన బేతు ప్రత్యూష (రాజు కోమాకుల) తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల మెదక్ లో డిగ్రీ ఎకనామిక్స్ లెక్చరర్ గా పనిచేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ నుండి (ఆసరా పెన్షన్) అనే అంశం పై పరిశోధనా చేసి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అవార్డ్ అర్హత సాధించారు.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఇంటిగ్రేటెడ్ పీజీ చదివిన ప్రత్యూష ఆ తర్వాత 2019 లో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం సాధించి ఒక వైపు ఉద్యోగం చేస్తూనే తన పరిశోధనను పూర్తి చేసి పీహెచ్డీ అవార్డ్ కు అర్హత సాధించడం ఎంతో సంతోషకరమైన విషయం.తన పరిశోధన లో RBI చైర్ ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసిన సూపర్ వైజర్ ప్రొఫెసర్ ఇంద్రకాంత్ సార్ సహకారం కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరువలేనిది అని పేర్కొంది..





