నేటి సాక్షి,కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి)
అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా గురువారం పైడిమడుగు గ్రామంలో గల జడ్పీ హైస్కూల్ పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులచే అవగాహన ర్యాలీ మరియు మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి. ఆనంద్ మాట్లాడుతూ
డ్రగ్స్ వద్దు ఆరోగ్యమే ముద్దు ..
డ్రగ్స్ కి నో చెప్పండి..
నేను హానికి గురయ్యే వారిని రక్షిస్తాను..
వంటి పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను చిన్నాభిన్నం చేసుకోవద్దని ఈ సందర్భంగా కోరారు. డ్రగ్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ డ్రగ్స్ నిరోధకంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.





