Tuesday, March 10, 2026

సీపీఐ మండల కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన భూక్యా నరసింహ..

నేటి సాక్షి పాలేరు ,జూన్ 26 :

కూసుమంచి మండలం గైగోళ్ళ పల్లి గ్రామానికి చెందిన భూక్యా నరసింహ వరుసగా రెండవ సారి సీపీఐ మండల కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం కూసుమంచి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన సీపీఐ మండల 6వ మహాసభలను నిర్వహించారు . ఈ సభలకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగం హేమంతరావు ,రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా ,రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జమ్మల జితేందర్ రెడ్డి జిల్లా కార్యదర్శి దండి సురేష్ ,గిరిజన సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా రామూర్తి ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు..ఈ సభలోనే 30 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు ఏకాభిప్రాయంతో రెండవసారి సీపీఐ కూసుమంచి మండల కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. సహాయ కార్యదర్శిగా జిల్లా లింగయ్య ,అల్లి వెంకటేశ్వర్లును ఎన్నుకున్నారు.. ఈ సందర్భంగా భూక్యా నరసింహ మాట్లాడారు.. తనపై నమ్మకంతో రెండవసారి సీపీఐ మండల కార్యదర్శిగా పనిచేసే అవకాశం ఇచ్చిన పార్టీకి , నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పారు. తనపై పార్టీకి ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు.. ఈ కార్యక్రమంలో నాయకులు గుండేపొంగు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News