Tuesday, March 10, 2026

వర్షాల పట్ల.అప్రమత్తంగా ఉండండి.

కమిషనర్ ఎన్.మౌర్య
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
వర్షాలు కురుస్తున్న తరుణంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం నగరంలోని 15వ వార్డు లోని పద్మావతి పార్క్ , పరిసర ప్రాంతాల్లో అధికారులతో కలసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రతి రోజూ చెత్త బండి వస్తోందా, త్రాగునీరు సకాలంలో వస్తున్నాయా అనే విషయాలు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న తరుణంలో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని అన్నారు. వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా మురుగునీటి కాలువల్లో చెత్తను తొలగించాలని అన్నారు. దోమలు ప్రబలకుండా మందులు పిచికారీ చేయించాలని అన్నారు. పద్మావతి పార్కులోనీ వాకింగ్ ట్రాక్ లో గుంతలను సరి చేసి, శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే అన్నా క్యాంటీన్ ను పరిశీలించి, ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్ , హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారి రవి, ఏసిపి బాలాజి , డి.ఈ.లు మహేష్, శిల్ప, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News