Tuesday, March 10, 2026

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రొసీడింగ్ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే , జిల్లా కలెక్టర్

పేద ప్రజల సొంత ఇంటి కల ఇందిరమ్మ ఇళ్లతోనే సాధ్యమవుతుంది .

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : గురువారం గద్వాల నియోజకవర్గం లో మల్డకల్ మండల కేంద్రము లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయిన వారికి అర్హులైన ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ హాజరయ్యారు…..
ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను అందించడం జరిగింది.

ఎమ్మెల్యే కి జిల్లా కలెక్టర్ కి, గ్రామ మాజీ ఎంపీపీ, పి ఏ సి ఎస్ ఛైర్మన్ నాయకులు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ….

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం ఆరు గ్యారెంటీ లో భాగంగా ఇప్పటికే రెండు గ్యారెంటీ లను పూర్తి చేయడం జరిగింది. మహిళా ప్రీ, 500 రూపాయల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రైతులకు రైతు రుణమాఫీ రైతు బంధు, రేషన్ కార్డులు, సన్న బియ్యం అందించడం జరుగుతుంది.
ఎన్నో ఏళ్లుగా పేద ప్రజలు సొంత ఇంటి లేక కూలి గుడిసెలో నివసిస్తున్న వారికి ప్రభుత్వము ఐదు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఇందిరమ్మ ఇల్లు ద్వారా ప్రతి నిరుపేద కుటుంబానికి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లును కట్టించి ప్రతి ఒక్క పేద ప్రజల సొంతింటి కలను ఇందిరమ్మ ఇల్లు తోనే సాధ్యమవుతుందని తెలిపారు.
గద్వాల నియోజకవర్గ లో మొదటి విడతగా 3500 ఇండ్లు మంజూరు కావడం జరిగింది ‌. ఇందులో మల్డకల్ మండలానికి 480 ఇండ్లను కేటాయించడంతో ఇల్లు లేని పేద ప్రజలకు సొంతింటి కల నెరవేర్చు కోడానికి ఇందిరమ్మ ఇళ్లు పథకంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవడానికి ప్రభుత్వము కృషి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా సాయ శక్తుల కృషి చేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు.

ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని తెలిపారు. గద్వాల నియోజకవర్గ
అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం నేను ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం జరిగింది. నన్ను ఆశీర్వదించి గెలిపించిన ప్రజలందరి కొరకు అభివృద్ధి కొరకు గద్వాల నియోజకవర్గ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిసి ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని జరిగిందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో కూలి గుడిసె లేకుండా చేయాలని ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లలో ప్రతి నియోజకవర్గానికి 3500 మంజూరు చేయడం జరిగింది. ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లలో ఐదు లక్షల రూపాయల ప్రభుత్వం అందజేయడం జరుగుతుందని తెలిపారు.
గద్వాల నియోజకవర్గంలోని మల్డకల్ మండలం ఇందిరమ్మ ఇల్లు ద్వారా మంజూరైన వారు త్వరగా ఇంటి నిర్మాణము పనులను ప్రారంభించాలి మంజూరైన పత్రములోని ప్రతి ఒక్క విషయంలో తెలపడం జరుగుతుంది కాబట్టి 45 రోజులోపు ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించాలి ప్రారంభించిన వారికి ప్రభుత్వం విడుదలవారీగా డబ్బులను వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా రానివారికి కూడా ప్రభుత్వం త్వరలోనే రెండో విడతలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కొరకు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ మాజీ ఎంపీపీలు రాజారెడ్డి విజయ్, మాజీ జెడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి,PACS ఛైర్మన్ తిమ్మారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వీరన్న, PACS వైస్ చైర్మన్ విష్ణు, జిల్లా సీనియర్ నాయకులు పటేల్ ప్రభాకర్ రెడ్డి , మధుసూదన్ రెడ్డి,సీతారాం రెడ్డి, సత్యం రెడ్డి, నాయకులు అజయ్,చక్రధర్ రెడ్డి, వెంకటన్న, తూం కృష్ణ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, భారత్ రెడ్డి, నరసింహ రెడ్డి, ఆంజనేయులు, శివారెడ్డి, పురుషోత్తం రెడ్డి, వీరేష్ నాయక్, సవారన్న, ప్రతాప్, రాజు , నర్సింహులు, లక్ష్మన్న,మధు నాయకి, నరేందర్, నారాయణ, జీవన్ రెడ్డి, జయరాములు, రాముడు, రాధాకృష్ణారెడ్డి, ఎల్లప్ప ,పరశురాముడు
ప్రవీణ్, మహేష్, తిమ్మప్ప, రాంగోపాల్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News